ఏపీకి రెడ్ అలెర్ట్

CYCLONE MONTHA: ఆంధ్రప్రదేశ్‌లో తుపాను ముప్పు ప్రస్తుతం ఎదురుగా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుపాను వేగంగా దూసుకొస్తోంది. రాష్ట్ర తీరాలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అక్టోబర్ 26, 27, 28, 29 తేదీల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 28న సాయంత్రం నాటికి కాకినాడ సమీపంలో తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉంది.

ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. భారీ వర్షాలు, భీకర తుఫానులు ఎదురవుతాయి.

విశాఖపట్నం నుంచి తిరుపతి వరకూ ఈ తుపాను ప్రభావం గణనీయంగా ఉంటుంది. తెలంగాణలోని హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఏపీలో తీరప్రాంత జిల్లాల్లోని విద్యా సంస్థలకు అక్టోబర్ 28, 29 తేదీల్లో సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ సూచించింది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు మానుకోవాలని, అత్యవసర సందర్భాలు తప్ప బయటకు రాకూడదని హెచ్చరించారు.

మచిలీపట్నం, దివిసీమ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల ముప్పు ఉంది. అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story