Cyclone Montha: మొంథా తుపాను: సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్
ప్రధాని మోదీ ఫోన్

Cyclone Montha: మొంథా తుపాను ప్రభావాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. తుపాను సంబంధిత అంశాలపై వివరంగా చర్చించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యల గురించి చంద్రబాబు ప్రధానికి తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్‌లో మంత్రులు నారా లోకేశ్, అనిత, ముఖ్యసచివ విజయానంద్ తదితర ఉన్నతాధికారులతో కలిసి సీఎం సమీక్షాసమావేశం నిర్వహించారు. ప్రధాని కార్యాలయంతో సమన్వయం ఏర్పరచుకోవాలని మంత్రి లోకేశ్‌కు ముఖ్యమంత్రి చెప్పారు.
‘‘తుపాను కదలికలను ప్రతి గంటకూ ట్రాక్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు, వరదలకు గురవుతున్న ప్రాంతాల్లో ముందుగానే చర్యలు ప్రవేశపెట్టాలి. కాల్వలు, గట్లను బలోపేతం చేసి పంటలకు నష్టాలు తప్పించాలి. వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయం ఏర్పరచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రాణాలు, ఆస్తులకు నష్టం జరగకుండా చూడాలి’’ అంటూ చంద్రబాబు దిశానిర్దేశాలు జారీ చేశారు.

