CM Chandrababu: రాష్ట్రానికి తీవ్ర వాయుగుండం ముప్పు పొంచి ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలపై అత్యవసర సమీక్ష నిర్వహించారు.

శ్రీకాకుళం-కవిటి మధ్య నేటి మధ్యాహ్నం తీవ్ర వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. శ్రీకాకుళం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా వరకు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు.

కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని.. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసి నదులు, వాగులు, వంకల్లో ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షించాలని చంద్రబాబు ఆదేశించారు. సీఎస్, డీజీపీతో పాటు మంత్రులు, వివిధ శాఖల అధికారులతో పరిస్థితిని సమీక్షించిన సీఎం.. రిజర్వాయర్లలో నీటి నిల్వలకు అవసరమైన చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని దిశానిర్దేశం చేశారు. 261 మండలాల్లో వర్షాలపై ప్రత్యేక అంచనాలు ఉన్నందున 24, 25 తేదీల్లోనూ అప్రమత్తత కొనసాగించాలని సూచించారు.

Next Story