Ap BJP : గిరిజన ప్రాంతాల అభివృద్ధి బిజెపి థ్యేయం
చాయ్ పే చర్చాలో ఆంధ్రప్రదేశ్ బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్

గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధ్యేయమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. సారథ్యం యాత్రలో భాగంగా పాడేరు జిల్లాలో మాధవ్ పర్యటన కొనసాగుతుంది.ఈసందర్భంగా పాడేరు లో నిర్వహించిన ఛాయ్ పే చర్చ లో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. స్థానికులు ద్వారా గిరిజన ప్రాంతాల సమస్యలు మాధవ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ దేశంలో పేదరికం నిర్మూలన కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అనేక పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి అన్నారు. గిరిజన ఉత్పత్తులు స్థానికంగా ప్రాసెసింగ్ యూనిట్ లు ఉంటే ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని మాధవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో ఘాట్ రోడ్డు నిర్మాణం లో వేతనాలు పెంచాలని మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో ఉద్యమం జరిగి స్వాతంత్ర్య పోరాటంగా మారిన అంశాన్ని ఈ సందర్భంగా మాధవ్ ప్రస్తావించారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను రక్షించు కోవాలన్నారు. రాజమహేంద్రవరం నుండి పాడేరు, చింతూరు, అరకు మీదుగా విజయనగరం జాతీయ రహదారి కి అనుసంధానం గా మాడుగుల, నర్సీపట్నం ఘాట్ రోడ్డు నిర్మాణం ద్వారా రవాణా సదుపాయాలు మెరుగు పడతాయని మాధవ్ తెలిపారు.
