✕
State Election Commission: పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. గ్రామీణ ప్రాంతాల్లో యథాతథం: రాష్ట్ర ఎన్నికల సంఘం
By PolitEnt Media
Published on:
రాష్ట్ర ఎన్నికల సంఘం

x
State Election Commission: ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎన్నికల కోడ్)ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఎత్తివేసింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల ప్రక్రియ కూడా శనివారంతో ముగిసింది.
ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ను ఈ నెల 7వ తేదీ రాత్రి 10 గంటల నుంచి ఎత్తివేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి యథావిధిగా అమలులో ఉంటుందని ఎస్ఈసీ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
Next Story

