Pawan Kalyan: చిత్తూరు జిల్లా పడిపుట్లబైలు సమీపంలో ఏనుగుల సంచారంపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సమీక్షించారు. ఏనుగుల కదలికలపై నిత్యం అప్రమత్తంగా ఉండాలని, మనుషులపై దాడులు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఏనుగుల గుంపును అడవిలోకి మళ్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, అవసరమైన చోట్ల కుంకీ ఏనుగులను రంగంలోకి దించాలని ఆదేశించారు. హనుమాన్‌ బృందాలు, పోలీసు, రెవెన్యూ సిబ్బంది సహకారంతో నిరంతరం నిఘా ఉంచాలని తెలిపారు. ఏనుగుల సంచారం ఆధారంగా పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

పంటలు నష్టపోయిన రైతులకు తక్షణం పరిహారం చెల్లించే ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. మానవ-ఏనుగు ఘర్షణలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Next Story