Endowments Dept Assistant Commissioner Shanti: ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆమె ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళవారం తాడేపల్లి, ఉండవల్లి సహా నాలుగు ప్రాంతాల్లో ఏకకాల సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో భారీగా అక్రమ ఆస్తులు బయటపడ్డాయి.

విశాఖపట్నం ఎండాడలో లగ్జరీ ఫ్లాట్, తాడేపల్లి కుంచనపల్లిలో జీ+2 భవనం, 770 గ్రాముల బంగారు నగలు, 3 కిలోల వెండి వస్తువులు గుర్తించారు. అంతేకాకుండా రూ.1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో మరో రూ.3 లక్షలు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం కూడా స్వాధీనం చేసుకున్నారు.

అక్రమాల ఆరోపణలతో 2024 జులై నుంచి 2026 మార్చి వరకు శాంతి సస్పెన్షన్‌లో ఉన్నట్లు తెలిసింది. ఏసీబీ అధికారులు ఈ కేసుపై మరిన్ని వివరాలు బయటపెడుతున్నారు.

Next Story