బిజెపి శ్రేణులు కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పిలుపు

ప్రతి బిజెపి కార్యకర్త ప్రజానాయకుడు గా ఎదగాలని అందుకు అనుగుణంగా ప్రణాళిక లు రచించుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం చిత్తూరు జిల్లాలో జరిగిన సారథ్యం యాత్ర లో భాగంగా బిజెపి కార్యకర్తలు మాధవ్‌ దిశానిర్దేశం చేశారు. బిజెపి కార్యకర్తలు కు భయం జంకు అవసరం లేదు ప్రజాక్షేత్రంలో బిజెపి బలపడాలని అందుకు అనుగుణంగా గ్రామ సర్పంచ్, ఎంపిటిసి, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పోరేషన్, కౌన్సిల్ ఎన్నికల లో పోటీ చేసేందుకు సమాయత్తం కావాలని మాధవ్ కార్యకర్తల లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. బిజెపి కార్యాలయాలు ప్రజల సమస్యలు పరిష్కారం చేసే వేదిక లు గా మార్చాలని సూచించారు. అదేవిధంగా ప్రతి సోమవారం కలెక్టరేట్ కార్యాలయం లో నిర్వహించే స్పందన కార్యక్రమాలు లో ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి పార్టీ తరపున మన వంతు కృషి చేయాలని శ్రేణులకు సూచించారు. మండల,గ్రామ స్థాయిలో సమస్యలు తెలుసుకుని వాటిని జిల్లా కలెక్టర్ కార్యాలయం లో స్పందన కార్యక్రమం లో సమస్యలు పరిష్కారం చేసే విధంగా బీజేపీ స్థానిక నాయకత్వం కృషి చేయాలన్నారు.

రాష్ట్రంలో అధికారంలో భాగస్వామ్యం ఉన్న పార్టీ గా ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానని మాధవ్‌ కార్యకర్తలకు హామీ ఇచ్చారు. కూటమిలో భాగస్వాములుగా మనకు రావల్సిన నామినేటెడ్‌ పోస్టులు, సాగునీటి సంఘాలలో ప్రాతినిధ్యం లభించిందని ఈ సందర్భంగా మాధవ్‌ గుర్తు చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ విద్యావేత్త, ఆంధ్ర యూనివర్శిటీ తొట్టతొలి వైస్‌ఛాన్సిలర్‌ సర్ కట్టమంచి రామలింగారెడ్డిని సమావేశంలో ప్రస్తావిస్తూ ఆయన చేసిన కృషి పి వివరించారు. కట్టమంచిరామలింగారెడ్ఢి ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఆనాడు అయన చేసిన సేవలు మరువలేనివి అన్నారు. చిత్తూరు జిల్లా లో పాడి పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తాయన్నారు.అదేవిధంగా మామిడి రైతులు కు భరోసా ఇచ్చేందుకు పార్టీ పరంగా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని హామీ ఇచ్చారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story