BJP State President Madhav: పేదలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారని భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ తెలిపారు.

గురువారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించిన మాధవ్‌, పోస్టల్ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాల నమోదు స్టాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చాలా తక్కువ ప్రీమియంతో జీవిత బీమా పథకాలను ప్రధాని మోదీ అమలు చేస్తున్నారన్నారు. కేవలం రూ.750 చెల్లించినంత మాత్రాన రూ.15 లక్షల ప్రమాద బీమా సదుపాయం లభిస్తుందని వివరించారు.

పోస్టల్ ద్వారా అత్యధిక వడ్డీ ఇచ్చే అనేక పథకాలను కూడా మోదీ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని మాధవ్‌ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ప్రజలందరూ చేరేందుకు అన్ని నగరాల్లో ప్రత్యేక శిబిరాలు, స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

వికసిత భారత్‌ లక్ష్య సాధనకు అందరూ భాగస్వాములు కావాలని మాధవ్‌ ప్రజలను కోరారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story