Minister Payyavula Keshav’s Strong Remarks: సమాజంలో జగన్‌ కుటుంబం నిందితులే కానీ బాధితులు ఎంతమాత్రం కాదని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ స్పష్టం చేశారు. నేరమయ రాజకీయాలు మొదలుపెట్టి కొనసాగిస్తున్నది జగన్‌ కుటుంబమేనని ఆరోపించారు.

వైఎస్‌ కుటుంబంతోనే రాష్ట్రంలో ఫ్యాక్షన్‌ రాజకీయం మొదలైందన్నారు. కుటుంబాలు, వర్గాల మధ్య పరిమితమైన ఫ్యాక్షన్‌ను రాజకీయాల్లోకి విస్తరించినవారు జగన్ తాత రాజారెడ్డి అని విమర్శించారు. రాజకీయాల్లో హింసకు కొత్త పుంతలు తొక్కించిన కుటుంబం జగన్‌దేనని వ్యాఖ్యానించారు.

జగన్‌ వినే వారుంటే తమది స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబమని చెప్పుకుంటారని, అందుకే వాస్తవాలు గుర్తుచేస్తున్నామని పయ్యావుల కేశవ్‌ అన్నారు.

పులివెందుల పరిణామాలపై ఒక పుస్తకం విడుదల చేసే యోచనలో ఉన్నామని తెలిపారు. గొడ్డలి పార్టీ వల్ల సమాజంలో తరాలు నష్టపోతున్నాయని, అందుకే ఆ పార్టీ సమాజానికి హానికరమని గట్టిగా చెప్పారు. శాంతి భద్రతలు, పరిశ్రమలు, రాజ్యాంగ వ్యవస్థలపై గొడ్డలి వేటు వేసిన పార్టీ కాబట్టి జగన్‌ పార్టీని ‘గొడ్డలి పార్టీ’ అని అభివర్ణించారు.

జగన్‌ తనంత మంచోడు లేడంటూ తనకు తాను సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకోవడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. బాబాయ్ హత్య వెనుక ఎవరున్నారో జగన్ చెల్లి సహా రాష్ట్రంలోని చిన్నపిల్లలు కూడా చెబుతారని మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు.

Next Story