నకిలీ మద్య కేసు: జోగి రమేష్‌కు దగ్గరలో ఉచ్చు.. ఆధారాలు బయటపడ్డాయి!
ఆధారాలు బయటపడ్డాయి!

అద్దేపల్లి సోదరుల విచారణలో విస్తుపోయే అంశాలు.. సిట్‌కు కీలక సమాచారం
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌తో పాటు ఆయన సోదరుడు రాము పాత్రపై ఆధారాలు బయటపడ్డాయి. ఈ కేసులో ప్రధాన నిందితులైన అద్దేపల్లి జనార్దన్‌రావు (ఏ1), అద్దేపల్లి జగన్మోహన్‌రావు (ఏ2)ల విచారణలో జోగి రమేష్ ప్రోద్బలం, మద్దతుతోనే నకిలీ మద్య వ్యాపారం ప్రారంభించినట్లు తేలింది. ఎక్సైజ్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులు వీరిని ఏడు రోజుల కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారణ జరిపిన సమయంలో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో జోగి రమేష్, రామును నిందితులుగా చేర్చి త్వరలోనే కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు.
జనార్దన్‌రావు విచారణలో సంచలన సమాచారం వెల్లడి చేశాడు. "జోగి రమేష్ తనకు రూ.3 కోట్లు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ పెట్టుకోవచ్చని ఆశపడ్డాను. అందుకే ఈ వ్యాపారంలోకి దిగాను" అని రాతపూర్వకంగా స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ములకలచెరువులో జయచంద్రారెడ్డి సహాయంతో తయారీ ప్రారంభించమని జోగి సూచించినట్లు చెప్పాడు. జోగి మంత్రి పదవిలో ఉన్న 2023లోనే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్య ఉత్పత్తి మొదలుపెట్టామని, ఆఫ్రికా వెళ్లే ముందు గత నెల 23న జోగి ఇంటికి వెళ్లానని కూడా వెల్లడించాడు. ఈ సందర్భంగా సిట్ ఆ ఇంటి సీసీ కెమెరా ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుంది. మొత్తం విచారణను కోర్టు ఆదేశాల ప్రకారం వీడియోగ్రాఫ్ చేశారు.
గోవా డిస్టిలరీ నుంచి స్పిరిట్.. లేబుల్స్ ముద్రణ కూడా!
కేసులో మరో నిందితుడు బాలాజీ (ఏ3)కు స్పిరిట్‌ను గోవా నుంచి తీసుకువచ్చి జితిన్ అందించేవాడని తేలింది. జితిన్‌కు గోవాలోనే సొంత డిస్టిలరీ ఉందట. ఒక్కసారి 60-70 క్యాన్ల స్పిరిట్‌ను బెంగళూరు శివారులోని బాలాజీ తోటకు చేర్చేవాడు. అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం, ములకలచెరువు తయారీ యూనిట్లకు కలిపి పంపేవాడు. గోవాలో ఒక బ్రాండ్‌కు సంబంధించి నకిలీ లేబుల్స్ ముద్రించే ప్రింటింగ్ ప్రెస్‌ను పోలీసులు గుర్తించి, కొన్ని లేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు.
అద్దేపల్లి సోదరుల కస్టడీ ముగింపుతో వారిని ఎక్సైజ్ కోర్టులో న్యాయాధికారి లెనిన్‌బాబు ముందు హాజరుపరిచారు. విచారణ వీడియోలు, రాతపూర్వక స్టేట్‌మెంట్లను సమర్పించగా, కోర్టు రిమాండ్ విధించింది. జనార్దన్‌రావు, జగన్మోహన్‌రావులను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత జైళ్లకు తరలించారు.
బ్యాంకు లావాదేవీలు, ఆధారాల ధ్వంసం.. దర్యాప్తు లోతుల్లోకి
దర్యాప్తు అధికారులు ఏ1, ఏ2 బ్యాంకు ఖాతాల్లోని నాలుగేళ్ల లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పదమైనవాటిని నిందితులకు చూపించి వివరాలు తెలుసుకున్నారు. నకిలీ మద్య వ్యాపారంలో సూత్రధారులుగా అనుమానిస్తున్న కొంతమంది నేతలతో సంబంధాలు కనుగొన్నారు. ముఖ్యంగా, జనార్దన్‌రావు ఆఫ్రికా ప్రయాణానికి ముందు కీలక ఆధారాలను ధ్వంసం చేశాడు. ములకలచెరువు యూనిట్ బయటపడగానే ఫోన్‌లో ముఖ్య సమాచారాన్ని డిలీట్ చేసి, మెయిల్ ఐడీ లాగ్‌ఔట్ చేశాడు. చివరికి మొబైల్‌ను నాశనం చేశాడు. ఈ దిశగా దర్యాప్తు మరింత లోతుల్లోకి సాగుతోంది.








