మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి బెయిల్
మంగళవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సోమవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రుస్తుం మైనింగ్ కేసుల్లో కాకాణికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. కాకాణిపై నమోదు చేసిన మొత్తం ఎనిమిది కేసుల్లో బెయిల్ రావడంతో మంగళవారం ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. దాదాపు 85 రోజులుగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి జైల్లో ఉన్నారు. పొదలకూరు మండలం తాటిపర్తి రుస్తుం మైన్స్‌లో అక్రమ మైనింగ్ జరిగిందని గత ఫిబ్రవరి మాసంలో మైనింగ్ శాఖ ఇన్‌ఛార్జ్ డిప్యూటీ డైరెక్టర్ బాలాజీ నాయక్ పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్‌కు కాకాణి గోవర్ధన్‌రెడ్డి సహకించారని 120(బి), 290, 379, 427, 447, 506 సెక్షన్లతో పాటు పలు నాన్‌బెయిలబుల్ సెక్షన్లుతో కేసు నమోదు చేశారు. ఇదే కేసులో బలం లేదనే కారణంతో ఏ1తో పాటు మరో ఇద్దరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేసును మరింత పకడ్బందీగా పెట్టిన పోలీసులు అట్రాసిటీ సెక్షన్లు జత చేశారు.
