✕
Former TTD Chairman YV Subba Reddy: టీటీడీ మాజీ చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి పై ఏపీ సిట్ విచారణ జోరు
By PolitEnt MediaPublished on 20 Nov 2025 4:15 PM IST
ఏపీ సిట్ విచారణ జోరు

x
Former TTD Chairman YV Subba Reddy: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన వ్యవహారంలో మాజీ ఛైర్మన్, వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు గురువారం విచారిస్తున్నారు.
హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ ప్రాంతంలో వైవీ సుబ్బారెడ్డి నివాసంలోనే సిట్ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే సుబ్బారెడ్డి మాజీ పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) చిన్న అప్పన్నను సిట్ విచారించింది. అతడు అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో కీలక విషయాలు వెల్లడించాడని, ఆ ఆధారాలతోనే మాజీ ఛైర్మన్‌ను మరింత లోతుగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
తితిదేలో జరిగిన కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి పాత్ర ఏమ్మల్ని సిట్ లోతుగా పరిశీలిస్తోంది. విచారణ కొనసాగుతోంది.

PolitEnt Media
Next Story
