తెలుగు చదువుకున్నవారికే ఉద్యోగాలు కల్పించాలి

Former Vice President Venkaiah Naidu: తెలుగు చదువుకుంటేనే ఏపీ, తెలంగాణలో ఉద్యోగం ఇవ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ‘కృష్ణా తరంగ్ 2025’ ఉత్సవాల్లో పాల్గొని ఆయన మాట్లాడారు.

ఇటీవల రామోజీరావు జయంతి సందర్భంగా తెలుగు భాషలోనే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు చేయాలని ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరాను. దీనికి వారు చేస్తామని హామీ ఇచ్చారు. ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో ఉంటే.. అదే రామోజీరావుకు ఘన నివాళి అని ఆయన అన్నారు.

భారతీయ భాషలను కాపాడాలని ప్రధాని మోదీ ఆలోచన చేస్తున్నారు. ఆంగ్లేయులు వారి భాషను అధికార భాషగా చేసుకుని పాలన చేశారు. మనం తెలుగు వాళ్లం కాబట్టి తెలుగును పరిపాలన భాషగా చేయాలి. మెడికల్, ఇంజినీరింగ్ బోధన మాతృభాషలో జరిగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన వాళ్లు ఇంగ్లీష్ మాట్లాడటం రాకపోయినా పేపర్ మీద రాసుకుని మాట్లాడతారు. ఆంగ్లంలో మాట్లాడితేనే గొప్ప అని భావిస్తున్నారు. ముందు మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలి.. తర్వాత సోదర భాషలు నేర్చుకోవాలని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story