Cyclone Arnab: అర్నబ్ తుపానును ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.


విపత్తు నిర్వహణకు సంబంధించిన అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి అనిత వివరించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ బృందాలు 24 గంటలూ అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు.

తీరప్రాంత ప్రజలను అవసరమైతే వెంటనే తరలించేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని, అక్కడ స్వచ్ఛమైన తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు.


అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్‌ఫ్రీ నంబర్లు 1070, 112ను సంప్రదించాలని మంత్రి అనిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Next Story