ఈ రోజు బాధ్యతలు స్వీకరణ

AP Chief Secretary: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (సీఎస్‌) జి. సాయిప్రసాద్‌ శనివారం ఉదయం బాధ్యతలు అందుకుంటున్నారు. ప్రస్తుత సీఎస్‌ కె. విజయానంద్‌ ఉద్యోగ విరమణ చేసిన నేపథ్యంలో గత ఏడాది నవంబరు 29న ప్రభుత్వం ఆయనను నూతన సీఎస్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మట్టిగుంట గ్రామానికి చెందిన సాయిప్రసాద్‌ శనివారం ఉదయం 11.33 గంటలకు అమరావతి సచివాలయంలో అధికారికంగా సీఎస్‌ పదవి బాధ్యతలు స్వీకరిస్తారు. 1991 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోనూ వివిధ కీలక పదవుల్లో పనిచేశారు.

ఇటీవలి కాలంలో 2024 జూన్ నుంచి జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శిగా, 2025 జనవరి నుంచి ముఖ్యమంత్రి ఎక్స్‌ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అదనంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించారు.

2019-2024 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్‌ చైర్మన్‌ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఇంధన శాఖ ఎక్స్‌ అఫీషియో ప్రధాన కార్యదర్శిగా, సీసీఎల్‌ఏగా కూడా ఆయన పనిచేశారు. అనుభవజ్ఞుడైన ఐఏఎస్‌ అధికారిగా సాయిప్రసాద్‌ రాష్ట్ర పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తారని అంచనా వేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story