Ganta Srinivasa Rao: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన మానసిక పరిస్థితిని ఒక్కసారి స్వయంగా పరిశీలించుకోవాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచించారు. గతంలో విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించిన జగన్ ఇప్పుడు ‘మావిగన్’ అంటూ మాట్లాడుతున్నారని తీవ్రంగా ఎద్దేవా చేశారు.

విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన గంటా శ్రీనివాసరావు, “ఎర్ర బస్సు రాని చోటికి ఎయిర్‌బస్సు ఎందుకు అని జగన్ అన్నారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్టును తానే తెచ్చానంటున్నారు. ఆర్సెలార్‌ మిత్తల్‌ కూడా తానే తెచ్చానని చెప్పుతున్నారు” అని విమర్శించారు.

“2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తోంది. ఎయిర్‌పోర్టు ప్రారంభమైతే ఉత్తరాంధ్ర రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి” అని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదానికి సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు.

Next Story