ఫ్యామిలీ బెనిఫిట్‌ మానిటరింగ్‌ వ్యవస్ధ సమీక్షలో ఆదేశించిన సీయం చంద్రబాబు

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఫ్యామిలీ బెనిఫిట్స్‌ మానిటరింగ్‌ వ్యవస్ధపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలకు ఫ్యామిలీ కార్డులు జారీ చేయాలని సీయం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అన్నింటి వివరాలను ఫ్యామిలీ కార్డులో పొందుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే పాపులేషన్‌ పాలసీ తీసుకురావాలని సమీక్షా సమావేశంలో సీయం అధికారులను ఆదేశించారు. ఏఏ కుటుంబానికి ఎటువంటి అవసరాలు ఉన్నాయనే విషయాలను క్షేత్ర స్ధాయి నుంచి సమాచారం తీసుకోవాలని సీయం సూచించారు. ప్రభుత్వ సంక్షేమం అవసరమైన వారికి వెంటనే అందేలా వ్యవస్ధను సిద్దం చేయాలన్నారు. ఆధార్‌ తరహాలో ఫ్యామిలీ కార్డును ఉపయోగించుకోవాలని సీయం సూచించారు. ప్రజలకు ఇచ్చే ఫ్యామిలీ కార్డులో వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్‌ చేసుకుంటూ ఉండాలని సీయం అన్నారు. త్వరలోనే పాపులేషన్‌ పాలసీ కూడా తీసుకు వస్తామని చెప్పారు. ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్ధితి రాకూడదని సీయం అభిప్రాయపడ్డారు. అందరికీ లబ్ది కలిగేలా అవసరమైతే పథకాలను రీడిజైన్‌ చేసే అంశాన్ని పరిశీలిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story