MLA Goutu Sireesh: మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన ఈ కీలక సమయంలో వైకాపా పార్టీ డ్రామాలు ఆడుతోందని ఎమ్మెల్యే గౌతు శిరీష తీవ్రంగా విమర్శించారు. దేశవ్యాప్తంగా మహిళలు రిజర్వేషన్ బిల్లుతో హర్షం వ్యక్తం చేస్తుంటే, వైకాపా నేతలు మాత్రం విషం చిమ్ముతున్నారని ఆమె ధ్వజమెత్తారు.

జగన్ రెడ్డి పాలనలో దక్షిణాది రాష్ట్రాలన్నింటి కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే నేరాలు ఎక్కువగా జరిగాయని, పెద్ద రాష్ట్రాల కంటే కూడా మహిళలపై దాడులు ఎక్కువగా జరిగాయని గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయని గౌతు శిరీష అన్నారు. జగన్ హయాంలో కులాలు, మతాలకు అతీతంగా ప్రతి వర్గం మీదా వైకాపా ప్రభుత్వం దమనకాండ సాగించిందని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులను, ముఖ్యంగా మహిళలను ఐదేళ్లపాటు నరకయాతనకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ఆడబిడ్డలను రోడ్లపైకి ఈడ్చిన ఆ చరిత్రను రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరచిపోరన్నారు.

అక్కా-చెల్లెళ్లని అంటూ మాట్లాడే జగన్ రెడ్డి తన సొంత తల్లి, చెల్లిని కూడా గౌరవించలేకపోయారని ఎద్దేవా చేశారు. తండ్రి ఆస్తిలో వాటా కోరినందుకు తల్లిని ఇంటి నుంచి వెళ్లగొట్టడం, చెల్లెలిపై సోషల్ మీడియాలో దాడులు చేయించడం వంటి చర్యలపై సమాధానం చెప్పాలని నిలదీశారు. మద్యపాన నిషేధం అమలు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్, కల్తీ మద్యంతో వేలాది కుటుంబాలను రోడ్డున పడేశారని తీవ్రంగా ఆరోపించారు.

మహిళలకు ఆస్తి హక్కులు కల్పించిన దైవస్వరూపుడు నందమూరి తారకరామారావు అని, స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్‌లు అమలు చేసి డ్వాక్రా సంఘాల ద్వారా కోటి మంది మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించిన విజేత చంద్రబాబు నాయుడు అని గౌతు శిరీష ప్రశంసించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story