✕
Amaravati Construction: అమరావతి నిర్మాణం కోసం అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు పట్టాలు.. ప్రభుత్వం ఊరట
By PolitEnt MediaPublished on 17 Sept 2025 7:31 PM IST
రైతులకు పట్టాలు.. ప్రభుత్వం ఊరట

x
Amaravati Construction: రాజధాని అమరావతి నిర్మాణం కోసం అసైన్డ్ భూములు అప్పగించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లో ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లను ‘అసైన్డ్’గా కాకుండా, పట్టా పేరుతో జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ జీఓ జారీ చేశారు.
అసైన్డ్ ప్లాట్లు అమ్మకానికి ఇబ్బంది కలిగించాయని రైతులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగా, ఇటీవల మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ అంశంపై చర్చించి, అందరికీ పట్టా పేరుతో ప్లాట్లు అప్పగించాలని ఆదేశించారు. దీంతో అవసర మార్పులు చేసి ఆదేశాలు జారీ అయ్యాయి.

PolitEnt Media
Next Story