సింగపూర్‌ వాణిజ్య మంత్రి టాన్‌ సీలాంగ్‌ తో చంద్రబాబు భీటీ

రికార్డులు సరి చేసేందుకే సింగపూర్‌ వచ్చానని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సింగపూర్‌ పర్యటనలో ఉన్న సీయం చంద్రబాబు బృందం రెండొవ రోజు ఆ దేశ వాణిజ్యం, పరిశ్రమలు, మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సీ లాంగ్‌తో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో సింగపూర్‌ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశాలపై సింగపూర్‌ మంత్రి టాన్‌ సీ లాంగ్‌ తో చర్చించారు. సింగపూర్‌ పై ఉన్న అభిమానంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ లో సింగపూర్‌ టౌన్‌షిప్‌ నిర్మించినట్లు సీయం టాన్‌ సీలాంగ్‌ కు చెప్పారు. సింగపూర్‌ ని చూసే రాత్రి పూట రోడ్లను శుభ్రం చేయడం హైదరాబాద్‌ లో ప్రారంభించినట్లు చంద్రబాబు తెలిపారు. నవంబరులో విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని సీయం చంద్రబాబు సింగపూర్‌ మంత్రి టాన్‌ సీలాంగ్‌ ను ఆహ్వానించారు. మానవ వనరులు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ట్రేడ్‌ రంగాల్లో సింగపూర్‌ భాగస్వామ్యం అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. నాలెడ్జ్‌ ఎకానమీలో ఏపీకి చెందిన నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో పనిచేస్తున్నారని సీయం సింగపూర్‌ మంత్రికి వివరించారు. గ్రీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్‌, ట్రాన్స్‌మిషన్‌ కారిడార్‌లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్‌ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని చంద్రబాబు టాన్‌ సీలాంగ్‌ ని కోరారు. డేటా సెంటర్ల ఏర్పాటులోనూ సింగపూర్‌ తోడ్పాడు అవసరమన్నారు. లాజిస్టిక్‌ రంగంలో సింగపూర్‌ బలంగా ఉందని, ప్రస్తుతం ఏపీలోనూ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. పోర్టులు, లాజిస్టిక్స్‌ రంగంలో ఉత్తమ విధానాలను అనుసరించటంలో సింగపూర్‌ ఆంధ్రప్రదేశ్‌ కి సహకరించాలని అభ్యర్ధించారు. గతంలో తాను హైదరాబాద్‌ వచ్చి మిమ్మల్ని కలిశానని టాన్‌ సీలాంగ్‌ చంద్రబాబుకు చెప్పారు. గ్రీన్‌ ఎనర్జీ రంగంతో పాటు సబ్‌ సీ కేబుల్‌ రంగంలో ఏపీతో కలసి పని చేసేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని టాన్‌ సీలాంగ్‌ సీయం చంద్రబాబుకు తెలిపారు. అలాగే గృహ నిరమాణ రంగంలోనూ ఏపీతో కలసి పనిచేసేందుకు తమ దేశం సిద్దంగా ఉన్నట్లు సీంగపూర్‌ మంత్రి టాన్‌ సీలాంగ్‌ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. ఈ సమావేశంలో మంత్రలు నారా లోకేష్‌, పొంగూరు నారాయణ, టీజీభరత్‌ తో పాటు పలువురు ఉన్నతాధికారలు పాల్గొన్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story