వందల కోట్లు దుబాయ్‌, అమెరికాకు తరలించినట్లు ఆరోపణలు

Illegal Funds Linked to Jagan’s PA Sent Abroad: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వై.ఎస్‌. జగన్‌మోహన్ రెడ్డి పర్సనల్ అసిస్టెంట్ కె. నాగేశ్వర్ రెడ్డి (కేఎన్‌ఆర్‌) వందల కోట్ల రూపాయల అక్రమ సంపాదనపై సిట్‌ విచారణ కొనసాగుతోంది. ఆయన ఆస్తులు ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో గుర్తించిన విషయం తెలిసిందే. తాజా విచారణలో ఆ అక్రమ సొమ్మును విదేశాలకు తరలించి పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

కడప జిల్లా కమలాపురం ప్రాంతానికి చెందిన కేఎన్‌ఆర్‌ చిన్ననాటి స్నేహితుడు పుత్తా శివశంకర్ రెడ్డి (పీఎస్‌ఆర్‌)ను సిట్‌ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు. లిక్కర్ స్కామ్ కేసులో కేఎన్‌ఆర్‌ అరెస్టు అయితే తను జగన్‌కు పర్సనల్ అసిస్టెంట్‌గా సేవలందించేందుకు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పీఎస్‌ఆర్‌ వెల్లడించినట్లు సమాచారం.

విచారణ సమయంలో కేఎన్‌ఆర్‌ ఆర్థిక వ్యవహారాలు తనకు తెలియవని మొదట్లో చెప్పిన పుత్తా శివశంకర్ రెడ్డి, సిట్‌ అధికారులు అడిగిన కొన్ని కీలక ప్రశ్నలకు విదేశీ పెట్టుబడులపై క్లూ ఇచ్చినట్లు తెలిసింది. దుబాయ్‌ మీదుగా అమెరికాలోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీకి సొమ్ములు చేరినట్లు, విదేశాల్లో బంధువుల పేరుతో కేఎన్‌ఆర్‌ పెట్టుబడులు ఉన్నట్లు చెప్పినట్లు సూచనలు వచ్చాయి.

పీఎస్‌ఆర్‌తో కేఎన్‌ఆర్‌ ఆర్థిక లవాదేవీలు ఉన్నాయా అని సిట్‌ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. లక్కీ హ్యుందాయ్ కార్ల షోరూమ్ భాగస్వామి, ఆడిటర్‌లను కూడా విచారించాలని సిట్‌ నోటీసులు జారీ చేసింది.

ఈ కేసులో కేఎన్‌ఆర్‌ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందా అనే అంశంపై కూడా సిట్‌ దృష్టి సారించింది.

Next Story