బుధవారం జరిగిన ఏపీ క్యాబినేట్ లో చంద్రబాబు వెల్లడి

రాష్ట్రానికి పెట్టుబడులు అడ్డుకునేలా వైఎస్‌ఆర్‌సీపీ చేస్తున్న కుట్రలపై విచారణ విచారణ చేయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. బుధవారం ఏపీ సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ప్రభుత్వ బ్రాండ్‌ దెబ్బతీసేలా వివిధ సంస్ధలకు 200 ఈ మెయిళ్ళు పపండంపై సీయం మండిపడ్డారు. వైఎస్‌ఆర్సీపీనే తమ పార్టీ సానుభూతి పరుడితో ఈ మెయిళ్ళు చేయించిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ సమావేశంలో ఆధారాలు చూపించినట్లు సమాచారం. తప్పులు చేసి ఆ తప్పులను ఎదుటి వాళ్ళ మీదకు నెట్టేయడం వైఎస్‌ఆర్‌సీపీ మొదటి నుంచి అమలు చేస్తోందని సీయం క్యాబినేట్‌ సమావేశంలో ఆరోపించినట్లు సమాచారం. తెరవెనుక నిధులు రాకుండా అడ్డుకోవడం, పథకాలు అమలు చేయడం లేదని ప్రజల్లో ప్రచారం చేయడం వైసీపీకి అలవాటుగా మారిందన్నారు. మామిడి రైతుల విషయంలోనూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇలానే దుష్ప్రచారం చేస్తోందని చంద్రబాబు క్యాబినేట్‌ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పన్నెండు అంశాలు ఎజెండాతో బుధవారం ఉదయం 11 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన సమావేశం అయిన ఏపీ క్యాబినేట్‌ మరో 8 అంశాలను ఎజెండాలో చేర్చి సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా మామిడి పంటకు కంపెనీలు ఇచ్చే ధరకు అదనంగా కేజీకి 4 రూపాయలు మద్దతు ధర ఇవ్వడానికి గానూ రూ. 260 కోట్లు విడుదల చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ డిక్లరేషన్‌ కు ఆమోదించింది. స్పేస్‌ పాలసీపై కూడా క్యాబినేట్‌ చర్చింది. సీఆర్డీఏకి భూములు ఇచ్చిన వారిలో కొంతమందికి పించన్లు మంజూరు చేసే అంశాన్ని క్యాబినేట్‌ అంగీకరించింది. ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారుల టవర్స్‌ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు రూ. 525 కోట్ల మంజూరుకు క్యాబినేట్‌ ఆమోదించింది. రాజధాని కోసం రెండో దశ ల్యాండ్ పూలింగ్‌ చేయడానికి మంత్రిమండలి అంగీకరించింది. రాజధాని పనులు కోసం 286 కోట్ల రూపాయల ఇసుక డీసెల్టింగ్ కు ప్రకాశం బ్యారేజి ఎగువన అనుమతి ఇస్తూ క్యాబినేట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నీటి వనరుల అభివృద్ధిలో భాగంగా 71 పనులు కొనసాగించేందుకు మంత్రిమండలి ఒకే చెప్పింది.

ఇక మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మంత్రులెవ్వరూ సంతృప్తికరంగా పనిచేయడం లేదని సమావేశంలో సీయం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మహిళా ఎమ్మెల్యేను వైసీపీ నేతలు కించపరిస్తే వెంటనే ఎందుకు స్పందించలేదని మంత్రులను సీయం నిలదీసినట్లు సమాచారం. నిత్యావసరస ధరలను మనం వచ్చిన తరువాత గణనీయంగా తగ్గించామని సీయం చెప్పారు. ఏపీలో ఏ నిత్యావసర వస్తువలు ధరలు ఎంత మేర తగ్గాయో స్వయంగా చంద్రబాబు మంత్రులకు చదివి వినిపించారు. అయితే చేసిన మంచి పనిని ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో విఫలమయ్యామని సీయం అభిప్రాయపడ్డారు. ఇండోసోల్‌ కి భూములు వద్దని రైతులను రెచ్చగొట్టి తన మీడియాలో పరిశ్రమలు తరలిపోతున్నాయని వైఎస్‌.జగన్‌ రాయిస్తున్నాడని, వైసీపీ కుట్రలను తిప్పి కొట్టాలని మంత్రివర్గ సహచరులకు సీయం దిశానిర్దేశం చేశారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story