ఇండియన్‌ పోలీస్‌ సర్వీసుకు రాజీనామా

ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి సిద్ధార్ధ కౌశల్‌ స్వచ్ఛంధ పదవీ విరమణ తీసుకున్నారు. 2012వ బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన సిద్ధార్ధ కౌశల్‌ గతంలో ప్రకాశం, వైఎస్‌ఆర్‌ కడప, కృష్ణా జిల్లాల్లో ఆయన ఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో అడ్మిన్‌ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే సిద్ధార్ధ కౌశల్‌ రాజీనమా పట్ల రాజకీయ వత్తిళ్ళు, ప్రభుత్వ వర్గాల వేధింపులే కారణమని జరగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.

ఇండియన్‌ పోలీస్‌ సర్వీసు నుంచి తాను స్వచ్ఛందంగా రాజీనామా చేశానని సిద్దార్ధ కౌశల్‌ స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కౌశల్‌ చెపుతున్నారు. కుటుంబ సభ్యుల అభిప్రాయలను కూడా పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అంతే తప్ప నేను రాజీనామా చేయడంలో ఎవరి ఒత్తిడి, బలవంతం లేదని సిద్దార్ధ కౌశల్‌ స్పష్టం చేశారు.

ఐపీఎస్‌ అధికారిగా పని చేయడం నా జీవితంలో అత్యంత గౌరవప్రదమైన, తృప్తికరమైన అనుభవం అని సిద్దార్ధ కౌశల్‌ అంటున్నారు. ఇంతకాలం ఐపీఎస్‌ అధికారిగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని నా సొంత ఇంటిలా భావించానన్నారు. ఏపీ ప్రజలపై తనకు ఎనలేని ప్రేమ, గౌరవం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, నా పై అధికారులకు, సహచర అధికారులకు, ఉద్యోగులతో పాటు నన్ను ఆదరించిన ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక నుంచి మరో రూపంలో సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు సిద్దార్ధ కౌశల్‌ చెప్పారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story