CM Chandrababu: సాగునీటి ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు సహా వివిధ సాగునీటి పనుల పురోగతిని సోమవారం సీఎం సమీక్షించారు.

ఈ సమీక్ష సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, నీటి నిర్వహణలో సాగునీటి సంఘాలను మాత్రమే కాకుండా సామాన్య ప్రజలను కూడా భాగస్వాములను చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం కోసం స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాలని సీఎం సూచించారు. ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయడం ద్వారా రైతులకు సకాలంలో నీటి సరఫరా అందించి వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story