జిఎస్ఎల్వి ఎఫ్16 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని

శ్రీహరికోట నుంచి త్వరలో ప్రయోగం జరగనున్న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌16 ప్రయోగం విజయవంత కావాలని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ శ్రీచెంగాళమ్మ పరమేశ్వరీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం సూళ్ళూరుపేటలో కాళంగి నది ఒడ్డున ఉన్న శ్రీచెంగాళమ్మ అమ్మవారిని ఇస్రో చైర్మన్‌ దర్శించుకున్నారు. చెంగాళమ్మ దేవాలయం సహాయ కమిషనర్‌ బి.ప్రసన్నలక్ష్మి ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్‌ చెంగాళమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాలయ మండపంలో ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ కు ఆలయ మర్యాదలతో ఆశీర్వచనాలు అందించారు. చెంగాళమ్మ ఆలయ ట్రస్ట్‌ మాజీ సభ్యుడు ఆకుతోట రమేష్‌ ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భముగా ఇస్రో చైర్మన్ నారాయణన్ మీడియా తో మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు రాకెట్ కు కౌంట్ డౌన్ ప్రారంభమవుతుందని చెప్పారు. వాతావరణ సమాచారం అందించడం లో నిసార్ ఉపగ్రహం అత్యంత కీలకంగా పనిచేస్తుందని ఈ ఉపగ్రహం లో నాసా సహకారం తో "ఎల్" బ్యాండ్ పేలోడ్స్ పెట్టడం జరిగిందని ఇస్రో "ఎస్" బ్యాండ్ పేలోడ్స్ అమర్చడం జరిగిందని , ప్రయోగం అనంతరం 40 రోజుల తరువాత నిసార్ ఉపగ్రహం సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలియజేసారు.ఇస్రో చైర్మన్ తో పాటు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్, షార్ గ్రూప్ మేనేజర్ గోపికృష్ణ తదితరులు ఉన్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story