Nara Lokesh’s Sharp Remarks : మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడంలో తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లో సమర్థులైన మహిళా నాయకులను ప్రోత్సహిస్తామని, క్రమబద్ధంగా ఈ సంస్కరణను అమలు చేసి చూపిస్తామని తెలిపారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన లోకేశ్, రాజకీయాలు, ప్రభుత్వం రెండింటిలోనూ సంస్కరణలకు నాంది పలికింది తెదేపా అని గుర్తు చేశారు. ‘కార్యకర్తే అధినేత’, ‘తెలుగుదేశం నా బాధ్యత’ నినాదాలను మరింత బలంగా ముందుకు తీసుకెళ్తామన్నారు.

ఇక జగన్‌మోహన్ రెడ్డిపై ఆయన తీవ్రంగా విమర్శించారు. “రాజారెడ్డి రక్త చరిత్రను జగన్ తానే ప్రస్తావించి, ప్రజలందరికీ తెలిసేలా చేశారు. గొడ్డలి పార్టీ నేతగా విమర్శలే పనిగా పెట్టుకున్నారు” అని లోకేశ్ మండిపడ్డారు.

డీఎస్‌సీ నియామకాలపై జగన్ సర్కారు వేసిన కేసులన్నింటికీ న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, “ఒక్క టీచర్ పోస్టు కూడా నిబంధనలకు విరుద్ధంగా భర్తీ చేయలేదు. నియామకాలు జరిగిన ఆరు నెలల తర్వాత దుష్ప్రచారం చేస్తున్నారు” అని ఆరోపించారు.

మహానాడు సక్సెస్:

మహానాడులో రెండో రోజు మధ్యాహ్నం వరకు 11.27 లక్షల మంది పాల్గొన్నట్లు లోకేశ్ వెల్లడించారు. పార్టీలో సంస్కరణలు నిరంతర ప్రక్రియ అని, ఎలాంటి ఇగోలు లేకుండా చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story