Minister Parthasarathy: జగన్.. హైవేపై 120 కి.మీ. దూరానికి 6 గంటలా?: మంత్రి పార్థసారథి
మంత్రి పార్థసారథి

Minister Parthasarathy: శ్రీకాకుళంలో మహిళా ఎస్సై పట్ల వైఎస్సార్‌సీపీ నేతల తీరును మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులపై దాడి చేసే స్థాయికి వచ్చారని ఆరోపించారు.
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుటుంబసభ్యులను పరామర్శించాల్సింది పోయి జగన్ ఎవరి కోసం వెళ్లారని ప్రశ్నించారు. “జగన్ వెళ్లే మార్గంలోనే భోగాపురంలో ప్రధాని మోదీ పర్యటన ఉంది. ప్రధానికి భద్రత కల్పించే దారిలో ఆందోళనలు చేయకూడదు. భద్రతా కారణాల రీత్యా జగన్ పర్యటనలో ధర్నాలు, ర్యాలీలు, సభలకు అనుమతి లేదు” అని మంత్రి అన్నారు.
భయపెట్టి అధికారంలోకి రావాలని జగన్ ప్రయత్నిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు తావులేదని స్పష్టం చేశారు. రెండేళ్లుగా ఆయన పర్యటనలను చూస్తే భయానక వాతావరణం కల్పించడమే లక్ష్యమని, ప్రధాని మోదీ పర్యటనను పక్కదారి పట్టించడమే ఉద్దేశమని విమర్శించారు. “విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం హైవేపై 120 కి.మీ. దూరం వెళ్లేందుకు 6 గంటలు అవసరమా?” అని పార్థసారథి ప్రశ్నించారు.
మంత్రి గుమ్మిది సంధ్యారాణి మాట్లాడుతూ, మహిళలంటే వైఎస్సార్‌సీపీ నేతలకు ఎప్పుడూ గౌరవం లేదని అన్నారు. ఎవరైనా బాధితులను పరామర్శిస్తారని, జగన్ మాత్రం నిందితుల వద్దకు వెళ్లారని విమర్శించారు. జగన్ ఎప్పుడూ నేరగాళ్లనే సమర్థిస్తారని, పోలీసులు, కోర్టులను వైఎస్సార్‌సీపీ నేతలు ఎప్పుడూ పట్టించుకోలేదని ఆమె అన్నారు.

