✕
Karumuri Nageswara Rao: మద్యం స్కామ్‌లో ముందస్తు బెయిల్ కోరిన కారుమూరి పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేత
By PolitEnt MediaPublished on
సుప్రీంకోర్టు కొట్టివేత

x
Karumuri Nageswara Rao: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా స్కామ్‌కు సంబంధించి ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సమర్థించింది. ఈ కుంభకోణంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, పిటిషనర్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కారుమూరి తరఫు న్యాయవాది అభ్యర్థించారు.
ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం, మద్యం స్కామ్‌లో రూ.350 కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం, కస్టోడియల్ విచారణ అవసరమని స్పష్టం చేసింది.
Next Story

