AP Cabinet Decisions: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం గురువారం మూడు గంటల పాటు జరిగింది. భోగాపురం విమానాశ్రయం పనుల పురోగతిపై సుదీర్ఘ చర్చ జరిగింది. రెండో దశలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశంపై మరింత అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించి తదుపరి కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

నేతన్న భరోసా: చేనేత కార్మికుల సంక్షేమం కోసం ‘నేతన్న భరోసా’ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 50 ఏళ్లలోపు ఉన్న బీపీఎల్ నేతలకు సంవత్సరానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు.

ఇతర ముఖ్య నిర్ణయాలు:

వెదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు.

శ్రీకాకుళంలో బ్రహ్మకుమారీస్ సంస్థకు మున్సిపల్ స్థల లీజు కొనసాగింపు.

పుష్కరాల నిర్వహణ, భద్రత, బందోబస్తు కోసం రూ.50 కోట్లు మంజూరు.

వివిధ సంస్థలకు భూకేటాయింపులు.

ఏపీ మార్క్‌ఫెడ్‌కు సెంట్రల్ బ్యాంక్ నుంచి రూ.300 కోట్ల రుణం కోసం ప్రభుత్వ గ్యారంటీ.

విష్ణు ఉమెన్స్ యూనివర్సిటీ, చలపతి యూనివర్సిటీలను ప్రైవేట్ యూనివర్సిటీల జాబితాలో చేర్చే ఆర్డినెన్స్‌పై చర్చ.

నేరడి బ్యారేజ్ నిర్మాణానికి రూ.641.10 కోట్ల పరిపాలనా అనుమతులు.

హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఫేజ్-2 పనుల అంచనా వ్యయం రూ.241.20 కోట్ల నుంచి రూ.312 కోట్లకు పెంచడం.

ఈ నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధి మరియు పేదల సంక్షేమానికి ఊతమిస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story