'ప్రొటెక్షన్ క్లోజర్' పిటిషన్ వేసిన గౌతం రెడ్డి

Fiber Net Case: ఫైబర్ నెట్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ అధికారులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మదుసూధన్ రెడ్డి తన ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు. అయితే, ఈ కేసును మూసివేయనున్నారని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఫైబర్ నెట్ చైర్మన్‌గా పనిచేసిన వైసీపీ నేత గౌతం రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను గుర్తించిన అక్రమాలపై విచారణ చేయాలని మహా డైరెక్టర్ మధుసూధన్‌కు లేఖ రాశానని పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను రాసిన ఆ లేఖపైనే కేసు నమోదైందని, ఇప్పుడు ఈ కేసును క్లోజ్ చేస్తున్నారనే సమాచారం తెలిసిన నేపథ్యంలో 'ప్రొటెక్షన్ క్లోజర్' పిటిషన్ వేశారని గౌతం రెడ్డి తెలిపారు. కేసు మూసివేసే ముందు తన వాదనలు వినాలని కోర్టును కోరారు.

రేపు (శుక్రవారం) ఏసీబీ కోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఈ విచారణలో కేసు మూసివేతకు అడ్డుకట్ట వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఫైబర్ నెట్ కేసు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో ఈ పరిణామం ఆసక్తి కలిగిస్తోంది. మరిన్ని వివరాలు కోర్టు తీర్పుపై ఆధారపడి రానున్నాయి.

ఈ సంఘటన వైసీపీ - తెలుగుదేశం పార్టీల మధ్య రాజకీయ ఉద్రిక్తతలకు కొత్త మలుపు తిప్పనుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story