శ్రీకాంత్ పెరోల్‌ వ్యవహారం నుంచి డైవర్ట్ చేయటానికే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పాట్లు

రౌడీషీటర్‌ శ్రీకాంత్‌ పెరోల్‌ వ్యవహారం నుంచి తాను బయటపడటానికి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తనపై హత్యకు కుట్ర జరుగుతోందని డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్లే చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో నెల్లూరులో జరుగుతున్న అనేక పరిణామాలపై కాకాణి మాట్లాడారు. నెల్లూరులో రౌడీషీటర్లు, ముఠాలను పెంచి పోషించింది కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కాదా అని కాకాణి ప్రశ్నించారు. ఎమ్మెల్యేపై హత్యకు కుట్రపన్నారని కేసులు నమోదు చేస్తున్నారు.. ఇదంతా శ్రీకాంత్‌ పెరోల్‌ వ్యవహారంలో తన పేరు మరుగున పరచడానికే కోటంరెడ్డి చేస్తున్నారని కాకాణి విమర్శించారు. నెల్లూరులో అనేక నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయని ప్రశాంతిరెడ్డి, కావ్యకృష్ణారెడ్డి, కోటంరెడ్డిలపై హత్యకు స్కెచ్‌ వేస్తున్నారని ప్రచారం చేస్తున్నారని హత్యా రాజకీయాలను తాము ప్రోత్సహించమని కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. శ్రీధర్‌రెడ్డి ఎమ్మెల్యే అవ్వడానికి కారణం వైఎస్‌.జగన్‌ అని తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన పనులు చేయకూడని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం, కోటంరెడ్డిలే నెల్లూరులో రౌడీ కల్చర్‌ తీసుకు వచ్చిందని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరోల్‌పై హోంమంత్రి సంతకం పెట్టింది వాస్తవం కాదా… ఎటువంటి ప్రలోభాలకు లొంగి హోంమంత్రి సంతకం చేశారని కాకాణి ప్రశ్నించారు. శ్రీధర్‌రెడ్డిపై హత్యాయత్నం ప్లాన్‌ చేసింది ఆయన మనుషులు కాదా అని కాకాణి నిలదీశారు. మా ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు తప్ప చేసినా వదలిపెట్టలేదని నాడు కోటంరెడ్డి ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేస్తే అప్పటి సీయం వైఎస్‌.జగన్‌ చర్యలు తీసుకోమని ఆదేశించారని గుర్తు చేశారు. హత్యాయత్నాల విషయంపై సీబీఐ విచారణ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. వైఎస్‌.జగన్‌ని వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తే సహించే పరిస్ధితులు ఉండవని కాకాణి గోవర్ధన్‌రెడ్డి హెచ్చరించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story