Nara Lokesh: టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన లోకేశ్‌కు నేతల అభినందనలు
బాధ్యతలు స్వీకరించిన లోకేశ్‌కు నేతల అభినందనలు

Nara Lokesh: తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామంగా మంత్రి నారా లోకేశ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలోని తన కార్యాలయంలో లోకేశ్‌ను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ స్థాయి నేతలు వరుసగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త బాధ్యతల్లో పార్టీని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లాలని వారు ఆకాంక్షించారు.
ఈ నియామకం టీడీపీలో మరో ముఖ్యమైన ఘట్టంగా భావిస్తున్నారు. యువ నాయకత్వంతో పార్టీకి కొత్త ఊపు వస్తుందని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.
అంతకుముందు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల జన్మదినాన్ని పురస్కరించుకుని లోకేశ్ సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేశ్ స్వయంగా ఆయనకు కేక్ తినిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడంతో పాటు శ్రేణులతో సమన్వయం పెంచేందుకు లోకేశ్ కీలక పాత్ర పోషిస్తారని నేతలు అభిప్రాయపడ్డారు.

