చంద్రబాబుపై మండిపడ్డ వైయస్ఆర్‌సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి

  • టీడీపీ హయాంలోనే అసలైన మద్యం అవినీతి
  • ఫైళ్ళలో సంతకాలు చేసి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు
  • దాని నుంచి తప్పించుకునేందుకు వేసిన ఎత్తుగడే ఈ లిక్కర్ స్కాం సృష్టి
  • పిట్టకథలు, కట్టుకథలతో లిక్కర్ స్కాం దర్యాప్తును సాగిస్తున్నారు
  • ఎక్కడో దొరికన నోట్ల కట్టలకు లిక్కర్ స్కాంకు ముడిపెడుతున్నారు

తన అవినీతిపై ప్రజల దృష్టిని మళ్ళించేందుకే సీఎం చంద్రబాబు లేని లిక్కర్ స్కాంను సృష్టించారని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విజయవాడలోని ఏసీబీ కోర్ట్ బయట మీడియాతో మాట్లాడుతూ కట్టుకథలు, పిట్టకథలతో లిక్కర్ స్కాం దర్యాప్తును రోజుకో మలుపు తిప్పుతున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో దొరికన నోట్ల కట్టలకు, లిక్కర్ స్కాంలో అక్రమ కేసులు బనాయించిన వారికి అంటగట్టి కుట్రపూరితంగా బురదచల్లే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రభుత్వంలో 2014-19 మధ్య చేసిన అవినీతి నుంచి తప్పించుకునేందుకు, ప్రజల దృష్టిని మళ్ళించేందుకు లిక్కర్ స్కాంను సృష్టించారు. ఈ స్కాంతో దుబాయ్, హైదరాబాద్‌లకు సంబంధం ఉందని, ఎన్నికల్లో ఈ డబ్బును ఖర్చు చేశారని, బంగారం కొన్నారని ఇలా నోటికి ఏది వస్తే దానిని మాట్లాడుతున్నారు. మొదట్లో మొత్తం రూ.50 వేల కోట్లు అన్నారు, తరువాత దానిని తగ్గించుకుంటూ వచ్చి ఇప్పుడు రూ.3500 కోట్లు అంటున్నారు. కనీసం ఎక్కడ స్కాం జరిగిందో, ఎలా చేశారో కూడా సిట్ అధికారులకే ఒక స్పష్టత లేదు.

వైయస్ఆర్‌సీపీ హయాంలో లిక్కర్ స్కాంలో ఎక్కడ పాలసీని ఉల్లంఘించారు, ఎక్కడ అవినీతికి పాల్పడ్డారో సిట్ అధికారులే చెప్పలేకపోతున్నారని. అసలు లిక్కర్ స్కాం అంటే టీడీపీ ప్రభుత్వంలో 2014-19లో జరిగిందే అని సజ్జల చెప్పారు. ఏడాదికి దాదాపు రూ.1300 కోట్లు ఆదాయం వచ్చే ప్రివిలైజ్డ్‌ ఫీజ్‌ను ఆర్థికశాఖ అనుమతి లేకుండా, కేబినెట్‌లో చర్చించకుండా జీఓ ఇచ్చి నాడు చంద్రబాబు రద్దు చేశారని సజ్జల ఆరోపించారు. ఈ ఫైల్‌లో సీఎంగా చంద్రబాబు సంతకం కూడా ఉందని తెలిపారు. ఇది కదా అవినీతి అంటే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మద్యం రేట్లను పెంచారు, ఎమ్మార్పీని మించి అధిక రేట్లకు విక్రయిస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ బెల్ట్‌ షాప్‌లు పెట్టి మద్యం విక్రయిస్తున్నారు. మద్యం వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రకారం ప్రభుత్వానికి మద్యం ద్వారా వస్తున్న ఆదాయం పెరిగిందా అంటే అదీ లేదు. వైయస్ జగన్ ప్రభుత్వంలో వచ్చిన దాని కన్నా కేవలం పదిశాతం కూడా పెరగలేదు. గత ప్రభుత్వంలో స్కాం వల్ల రెవెన్యూ రాలేదంటున్న చంద్రబాబు ఇప్పుడు తన పాలనలో తీసుకొచ్చిన పాలసీ వల్ల కనీసం నలబై శాతం వరకు అయినా రెవెన్యూ పెరగాలి కదా? ఎందుకు కేవలం పదిశాతమే పెరుగుదల కనిపిస్తోంది. మా హయాంలో మద్యం విక్రయాలను తగ్గించేందుకు ప్రయత్నించాం. అలాగే మద్యం ఆదాయం కూడా పెరిగింది. కానీ చంద్రబాబు పాలనలో మద్యం విక్రయాలు భారీగా పెరిగింది, కానీ ఆదాయం తగ్గింది. చివరికి మద్యం డోర్‌ డెలివరీ కూడా చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

ఎక్కడో పట్టుబడిన డబ్బును మద్యం స్కాం సొమ్ము అంటూ చిత్రీకరిస్తున్నారు. ఆ సొమ్ము రాజ్ కసిరెడ్డిదే నంటూ కట్టుకథలు అల్లుతున్నారు. ఆయన అరెస్ట్ అయి 90 రోజులు అయ్యింది. మద్యంలో ఆయన డాన్ అంటూ ఆరోపణలు చేసిన వారి, ఆయనదే ఆ సొమ్ము అయి ఉంటే, ఇన్ని రోజుల నుంచి ఆ సొమ్మును అక్కడే పెట్టుకుని కూర్చుంటాడా అని సజ్జల ప్రశ్నించారు. వైయస్ జగన్‌ను అడ్డుకోవడం అనేది చంద్రబాబు, లోకేష్‌ల అవివేకం. ఆయనకు ఎన్ని ఆటంకాలు కల్పిస్తే, అంతగా ఆయన బలపడతారు. నెల్లూరులో ఆయన పర్యటనకు జనం రాకూడదని రోడ్లను తవ్వేశారు. ఇదెక్కడి విచిత్రం? రేపు ఆయన పర్యటన అంటే రోడ్లకు అడ్డంగా గోడలు కూడా కడతారేమో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సింగపూర్ కంపెనీలకు వైయస్ఆర్‌సీపీ మెయిల్స్ పెడుతోందని ఆరోపిస్తున్న వారు, వాటిని బయటపెట్టగలని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story