Local Body Elections in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం తొలుత మున్సిపల్ ఎన్నికలను సెప్టెంబర్‌లో నిర్వహించాలని భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికలు పూర్తి కాగానే జెడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించే ప్రాధమిక ప్రణాళికను ఏపీ సర్కార్ సిద్ధం చేస్తోంది.

ఈ నెల 27వ తేదీ నుంచి 45 రోజుల పాటు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి, ప్రతిపక్ష నేతల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సీఎం సూచించారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్‌ను ఎన్నికల ప్రచారంగా ఉపయోగించుకోవాలని జోనల్ కోఆర్డినేటర్లు, పార్టీ నేతల సమావేశంలో టీడీపీ అగ్రనేతలు తెలిపారు.

ఈ క్రమంలో ఖాళీగా ఉన్న వివిధ నియామక పదవులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమగ్రంగా నిర్వహించడం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత బలం చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story