సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి పాసులా..!

Lokesh Slams Former CM Jagan: మాజీ సీఎం వైయస్ జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో వైకాపా కార్యకర్తలకు వీఐపీ పాసులు జారీ చేయడంపై మంత్రి లోకేష్ 'ఎక్స్' వేదికగా వంగ్యాస్త్రాలు విసిరారు." ఓర్నీ పాసు గాల, సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాసులు విన్నా గానీ.. సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి వీఐపీ పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే..! చూడలే..! అంటూ జగన్ తీరును ఎండగట్టారు.

కొద్ది రోజుల కిందట జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులకు మొదటిసారి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను కలవడానికి వీఐపీ పాసులు జారీ చేయించారు. ఈ పరిణామం పలువురిని షాక్ కు గురి చేసింది. మంగళవారం జరిగే వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్ సోమవారం పులివెందుల వచ్చారు. వైయస్ జగన్ కొంతమంది కార్యకర్తలను కలుసుకున్నారు. భద్రతా సిబ్బంది పాస్ ఉన్న వారినే అనుమతించడం. గతంలో ఎన్నడూ లేని విధంగా వీఐపీ పాసులు జారీ చేసే పద్ధతిని ప్రవేశపెట్టడంపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. పలువురు కార్యకర్తలు భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story