విశాఖ సమ్మిట్‌కు పిలుపు!

CM Chandrababu Invites Global Industrial Giants: వ్యక్తిగత కార్యక్రమాల కోసం లండన్ చేరిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపుతున్నారు. పారిశ్రామిక దిగ్గజాలతో భేటీలు, రౌండ్ టేబుల్ సమావేశాలు.. విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సుకు వారిని ఆహ్వానిస్తున్నారు.

లండన్ చేరిన సీఎం చంద్రబాబు మొదట ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ అఫైర్స్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జరాల్డ్‌తో సమావేశమవుతారు. అనంతరం హిందుజా గ్రూప్ భారత చైర్మన్ అశోక్ హిందుజా, యూరోప్ చైర్మన్ ప్రకాశ్ హిందుజా, హిందుజా రెన్యువబుల్స్ ఫౌండర్ శోమ్ హిందుజాలతో చర్చలు నిర్వహిస్తారు. రోల్స్ రాయిస్ గ్రూప్ సీటీఓ నిక్కి గ్రేడీ స్మిత్‌తో కూడా భేటీ కుదురుతుంది. ఎస్రామ్, ఎమ్రామ్ గ్రూప్ చైర్మన్ శైలేష్ హిరనందానీ, శామ్కో హోల్డింగ్స్ చైర్మన్ సంపత్ కుమార్ మల్లాయతో సమావేశాలు ఏర్పాటు చేశారు.

పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఈ సమావేశంలో బ్రిటిష్ హెల్త్ టెక్ అసోసియేషన్ ఎండీ పాల్ బెంటన్, ఏఐపాలసీ ల్యాబ్, ఫిడో టెక్, పీజీ పేపర్ కంపెనీ, నేషనల్ గ్రాఫీన్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు హాజరవుతారు. విశాఖ సమ్మిట్‌కు వీరిని ఆహ్వానిస్తూ, రాష్ట్ర అవకాశాలు, పెట్టుబడుల అవసరాలు వివరిస్తారు. సాయంత్రం భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామితో కూడా భేటీ జరుగనుంది.

కాగా, లండన్ పర్యటనలో భాగంగా సీఎం సతీమణి భువనేశ్వరి రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు స్వీకరించనున్నారు. నవంబర్ 4న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) నుంచి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 (ఎన్‌టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా), గోల్డెన్ పీకాక్ అవార్డు (హెరిటేజ్ ఫుడ్స్ వీసీ, ఎండీగా కార్పొరేట్ గవర్నెన్స్‌లో ఎక్సెలెన్స్ కోసం) అందుకుంటారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story