ఏబీవీపి ఆవిర్భావం రోజు బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉంది.

భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇచ్చిన ఈ పదవిని గౌరవంగా భావించి పని చేస్తానని ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీఎన్వీ మాధవ్‌ అన్నారు. బుధవారం ఆయన విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయలో సీనియర్ నాయకుల సమక్షంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాధవ్‌ మాట్లాడుతూ నా ముందు అధ్యక్షులైన వారి శక్తియుక్తులతో పార్టీని ముందుకు తీసుకువెళతానని అన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త తానే అధ్యక్షుడ్ని అయ్యానన్నంతగా పనిచేస్తున్నారని బీజేపీ శ్రేణులను అభినందించారు. ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం రోజు నేను బాధ్యతలు చేపడుతునన్నారు. బీఆర్‌.అంబేద్కర్‌, విశ్వనాథ సత్యనారాయణలకు నివాళులు అర్పించి అధ్యక్ష బాధ్యతలు చేపట్టానని మాధవ్‌ తెలిపారు. రాష్ట్రానికి శాసన భాషగా తెలుగు ఉండాలని ఒక శాసన నిఘంటువును తయారు చేసినందుకు విశ్వనాథ సత్యనారాయణకు నివాళులు అర్పించినట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌ చెప్పారు. మాధవ్‌ పదవీ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలందరూ మాధవ్‌ ని అధ్యక్షుడిగా స్వాగతిస్తున్నారని అన్నారు. మాధవ్‌ ని ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించిన తరువాత పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ వచ్చాయన్నారు. రాష్ట్రలో బీజేపీని మంచి స్ధాయికి తీసుకు వెళ్ళే పరిస్ధితులు ఉన్నాయని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎంపీ దగ్గుబాటి పుంరధేశ్వరి, బీజేపీ శాసనసభ్యులు పెన్మత్స విష్ణుకుమార్‌ రాజు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎన్‌.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated On 9 July 2025 4:16 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story