TDP MEETING : నెలాఖరులోగా మార్కెట్, దేవాలయాల కమిటీలను భర్తీచేస్తాం
నెల్లూరు ఉత్తమ కార్యకర్తల సమావేశంలో యువనేత నారా లోకేష్

- పనిచేసే వారికే పదవులు ఇస్తాం, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తిలేదు
- ఎంతోమంది కార్యకర్తల త్యాగాల ఫలితమే ఈరోజు మన అధికారం
- నిర్ణయాల్లో తప్పులుంటే సరిదిద్దుకుంటాం... వినడానికి సిద్ధంగా ఉన్నాం
తెలుగుదేశం పార్టీలో పనిచేసే వారికి, కష్టపడేవారికే పదవులు ఇస్తామని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని టీడీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. నెల్లూరు ఉత్తమ కార్యకర్తల సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ గతంలో మాదిరి మరోసారి నష్ట పోవడానికి సిద్దంగా లేమని అన్నారు. నాలుగు నెల్లకోసారి పార్టీ క్యాడర్ మొత్తం ప్రజల్లోకి వెళ్ళేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నామని తెలిపారు. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ తప్పులు జరిగితే సరిదిద్దుకుంటామనా చంద్రబాబు కూడా చెబితే వింటారని అన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు ఈ నెలాఖరులోగా ఎఎంసిలు, దేవాలయ కమిటీలు పూర్తిచేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. కోటిమంది సభ్యులుగల అతిపెద్ద కుటుంబం తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. సొంత కార్యకర్తలను కారుకింద తొక్కేసిన నేత రాష్ట్రంలో ఉన్నారని, కనీసం ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి కూడా జగన్ కి మనస్సు రాలేదని అదే చంద్రబాబు కందుకూరు వెళ్లినపుడు తొక్కిసలాట జరిగితే ఇంటింటికీ వెళ్లి క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. ఈరోజు మన అధికారం వెనుక ఎంతోమంది త్యాగాలు దాగి ఉన్నాయన్నారు.
ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
యువగళం పాదయాత్రలో చాలామంది నాతో నడిచారు, మార్పు నెల్లూరు నుంచే మొదలైందన్నారు. 2013నుంచి పార్టీలో నేను క్రియాశీలకంగా ఉన్నా, ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు పార్టీ కార్యక్రమాలన్నీ ప్రతి కార్యకర్త డోర్ టు డోర్ వెళ్లాలి. ప్రతిపక్షంలో ఉండగా టెక్నాలజీతో జోడించి కార్యక్రమాలు నిర్వహిస్తే ఫలితాలు వచ్చాయి. అధికారంలోకి వచ్చాక కూడా అదే ఒరవడి కొనసాగిస్తున్నాం. గత ఏడాది కాలంలో సభ్యత్వం తర్వాత సుపరిపాలన – తొలి అడుగు కార్యక్రమం మాత్రమే ఇచ్చాం. కార్యకర్తలంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములై కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగూరు నారాయణ, ఎన్ఎండి ఫరూక్, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా టిడిపి అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బీద రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
