Minister Lokesh: చట్టాన్ని అతిక్రమించి విధుల్లో ఉన్న మహిళా అధికారిపై దాష్టీకానికి ఒడిగట్టిన వైకాపా గూండాలపై కఠిన చర్యలు తప్పవని మంత్రి నారా లోకేశ్ గట్టిగా హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌పై వైకాపా నాయకులు, కార్యకర్తలు ప్రవర్తించిన తీరు తీవ్ర ఆక్షేపణీయమని ఆయన మండిపడ్డారు.

మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మహిళల భద్రత, గౌరవాన్ని ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. మహిళల భద్రత, గౌరవంతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు. మహిళలను అవమానించడం, వారిపై దాష్టీకం చూపడం, రాక్షస ఆనందం పొందడం వైకాపా డీఎన్ఏలోనే ఉందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సొంత తల్లిని, చెల్లిని గెంటేసిన చరిత్ర జగన్‌ రెడ్డిదైతే.. సమాజంలో కనిపించిన ప్రతి మహిళను అవమానించడం వైకాపా నాయకుల సంస్కృతిగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. విధుల్లో ఉన్న మహిళా అధికారిపై దురుసుగా ప్రవర్తించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని మంత్రి లోకేశ్ తేల్చి చెప్పారు.

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. మహిళా అధికారులు నిర్భయంగా విధులు నిర్వహించే వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేశ్ అన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story