మీ కళాత్మక బోధనా శైలి చూడముచ్చటగా ఉంది

Minister Nara Lokesh: శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడిని మంత్రి నారా లోకేశ్ అభినందించారు. పాతపట్నం మోడల్ స్కూల్‌లో బోటనీ బోధిస్తున్న బల్లెడ అప్పలరాజు ఆకర్షణీయమైన బోధనా విధానాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు.

‘‘అప్పలరాజు మాస్టారూ... మీ కళాత్మక బోధనా శైలి చూడముచ్చటగా ఉంది. పాతపట్నం ఏపీ మోడల్ స్కూల్‌లో బోటనీ సబ్జెక్ట్ బోధిస్తూనే, సహ ఉపాధ్యాయులు మరియు సిబ్బంది సహకారంతో ల్యాబ్‌ను ఆకర్షణీయంగా, విజ్ఞానపరంగా తీర్చిదిద్దారు. సైన్స్, నైతిక విలువలు, సాధారణ జ్ఞానం ప్రతిబింబించేలా ల్యాబ్‌ను కళాత్మకంగా రూపొందించి నిర్వహిస్తున్న విధానం అభినందనీయం’’ అని లోకేశ్ పేర్కొన్నారు. ఈ పోస్ట్‌తో పాటు ల్యాబ్‌కు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story