శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్

Minister Nara Lokesh: మంత్రి నారా లోకేష్ ఈరోజు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించారు. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం, ఆడిటోరియం, మ్యూజియం,స్మృతివనం,నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. 6.8 ఎకరాలలో పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా నిర్మాణం చేపట్టనున్నారు. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తుళ్లూరు, పెదపరిమి మధ్య ఉన్న స్థలంలో పనులు జరగనున్నాయి. కార్యక్రమంలో మంత్రులు నారాయణ, టీజీ భరత్ ఎమ్మెల్యే శ్రవణ్, కొలికిపూడి శ్రీనివాస్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story