Minister Nara Lokesh: దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేశ్ ఎల్‌జీ, శాంసంగ్, హ్యుందాయ్, అపాక్ట్‌ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు అనేక ప్రతిపాదనలు చేశారు.

ముఖ్యంగా ఏపీలో డెడికేటెడ్ శాంసంగ్ సిటీని ఏర్పాటు చేయాలని శాంసంగ్ సంస్థను లోకేశ్ కోరారు. రాష్ట్రంలో ఏఐ-రెడీ హైపర్‌స్కేల్ డేటాసెంటర్లు, సర్వర్ తయారీ, సర్వీసింగ్ సదుపాయాలతో కూడిన ఫుల్ ఏఐ కంప్యూట్ స్టాక్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. విశాఖపట్నంలో OSAAT క్లస్టర్‌ను కేంద్రంగా చేసుకొని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఉత్పత్తుల కోసం OSAAT కేంద్రం ఏర్పాటు, అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటం కంప్యూటింగ్ పరిశోధన కోసం శాంసంగ్ ఆర్‌&డి విభాగం, అమరావతిలో హెవీ ఇంజినీరింగ్, దుగరాజపట్నంలో నౌకా నిర్మాణ క్లస్టర్ అభివృద్ధికి శాంసంగ్ సహకారం కోరారు.

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌తో భేటీలో విశాఖపట్నంలో ఇంజినీరింగ్ సెంటర్/జీసీసీ ఏర్పాటు, శ్రీసిటీ ప్రాంతంలో డిస్‌ప్లే మాడ్యూళ్లు, సెన్సర్లు, పవర్ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాలు, చిల్లర్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. ఎల్‌జీ కెమ్‌తో కాకినాడ పోర్టు సమీపంలో పాలీస్టెరిన్ ఉత్పత్తి కేంద్రం, మూలపేటలో నాఫ్తా క్రాకర్, బయో ఇథనాల్, జీవ ఇంధనాల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

అపాక్ట్ సంస్థతో ఏఎస్‌ఏటీ (అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్) సెమీకండక్టర్ రంగంలో యువత నైపుణ్యాభివృద్ధి కోసం భాగస్వామ్యం కుదుర్చుకోవాలని సూచించారు. హ్యుందాయ్ మోబిస్‌తో తిరుపతి/అనంతపురం ప్రాంతంలో ఈవీ కాంపొనెంట్స్ & బ్యాటరీ సిస్టమ్స్ తయారీ కేంద్రం, విశాఖలో ఆర్‌&డి/ఇంజినీరింగ్ విభాగం ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ భేటీల్లో సంస్థల ప్రతినిధులు ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని, త్వరలో నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్నత స్థాయి పెట్టుబడులు, ఆధునిక సాంకేతికత కేంద్రాలు వచ్చే అవకాశాలు మెరుగుపడ్డాయని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story