Minister Ramanayudu: బాలకృష్ణకు మంత్రి రామానాయుడు ప్రత్యేక ఆహ్వానం
రామానాయుడు ప్రత్యేక ఆహ్వానం
Minister Ramanayudu: హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణను ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కలిశారు. ఈ నెల 24న పాలకొల్లులో జరుగనున్న తన కుమార్తె శ్రీజ వివాహానికి హాజరు కావాలని ఆయన ఆహ్వానం అందజేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో బాలకృష్ణను కలిసి పెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ-రామానాయుడు మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. వివాహానికి వస్తానని హామీ ఇస్తూ, "ఎలా వస్తానో మాత్రం చెప్పను" అంటూ బాలకృష్ణ నవ్వులు పూయించారు. ఆ సమయానికే దర్శకుడు బోయపాటి శ్రీను కూడా అక్కడే ఉండటం విశేషం. ఈ కలయికకు సంబంధించిన వీడియోను మంత్రి రామానాయుడు ‘X’లో పంచుకున్నారు.
ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న "అఖండ 2: తాండవం" చిత్రీకరణ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మొదట సెప్టెంబర్ 25న సినిమాను విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ, వీఎఫ్‌ఎక్స్ సహా కొన్ని టెక్నికల్ పనులు మిగిలి ఉండటంతో విడుదల వాయిదా పడింది. త్వరలోనే కొత్త రిలీజ్ తేదీని ప్రకటించనున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఇదే కాంబినేషన్‌లో వచ్చిన అఖండ చిత్రం భారీ విజయాన్ని సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సంబంధిత పనులు జరుగుతున్న ప్రసాద్ ల్యాబ్స్‌లోనే మంత్రి రామానాయుడు బాలకృష్ణను కలిసి తన కుమార్తె వివాహానికి ఆహ్వానించారు.
