✕
MLC Anantha Babu: పోలీసు కస్టడీలో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు
By PolitEnt Media
Published on:
వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు

x
MLC Anantha Babu: డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన ఆరోపణలపై వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కాకినాడలోని మొబైల్ కోర్టు అతడిని ఒక్కరోజు పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది.
సాక్షులను ప్రలోభపెట్టి, చంపేస్తానని బెదిరించినట్లు అనంతబాబుపై ఆరోపణలు ఉన్నాయి. కోర్టులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని, లేని పక్షంలో చంపేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ కేసులో ఇటీవల అతడిని అరెస్టు చేసిన పోలీసులు అనంతబాబు ఐఫోన్‌ను స్వాధీనం చేసుకుని కాల్ డేటా సేకరించారు.
తాజాగా కోర్టు కస్టడీ అనుమతితో పోలీసులు అనంతబాబును వివిధ కోణాల్లో విచారించి సమాధానాలు రాబట్టనున్నారు. ఈ అభియోగాలపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు పోలీసు విచారణ కీలకమవుతుందని అధికారులు తెలిపారు.
Next Story

