టీడీపీలోకి మరో ఎమ్మెల్సీ

MLC Marri Rajasekhar: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మరో గట్టి దెబ్బ తగిలింది. చిలకలూరిపేటకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం సాయంత్రం అమరావతిలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన అధికారికంగా పార్టీలో చేరనున్నారు.

ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్‌తో పాటు పలువురు వైసీపీ నేతలు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీలోని ఎమ్మెల్సీ పదవికి రాజశేఖర్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ మలుపు వైసీపీలో కలవరం రేపుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story