మోడల్ లైబ్రరీలు: మంత్రి లోకేశ్

Minister Lokesh: అమరావతిలో రూ.150కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో లైబ్రరీ నిర్మాణాన్ని చేపడుతున్నామని, 24నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘కొత్త జిల్లాల ప్రాతిపదికన 26 జిల్లా గ్రంథాలయాలు, 175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు తెస్తాం. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన అన్ని పుస్తకాలను అందుబాటులోకి తెస్తాం. మోడల్ లైబ్రరీలకు సంబంధించిన యాప్‌ను 100 రోజుల్లో ఆవిష్కరిస్తాం’ అని అసెంబ్లీలో అన్నారు. సోమవారం శాసనసభలో గ్రంథాలయాల అభివృద్ధి, సెస్ బకాయిలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధి కోసం శోభా డెవలపర్స్ అనే సంస్థ రూ.100 కోట్ల భారీ విరాళం అందించేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. దాతల సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖపట్నంలో రూ.20 కోట్లతో ఒక మోడల్ లైబ్రరీ నిర్మాణం చేపడుతున్నామని, మంగళగిరిలో నిర్మించిన మోడల్ లైబ్రరీని అక్టోబర్‌లో ప్రారంభిస్తామని చెప్పారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story