బాబూ.. మీ హిందీ భేష్!

Modi Praises: కర్నూలు సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హిందీలో చేసిన ప్రసంగం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆకట్టుకుంది. చంద్రబాబు హిందీని చక్కగా మాట్లాడారంటూ మోదీ ప్రశంసలు కురిపించారు. బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధిస్తుందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తూ, మోదీ తన 'ఎక్స్' ఖాతాలో స్పందించారు. "బిహార్ విజయావకాశాలపై మంచి హిందీలో మాట్లాడి, ఎన్డీయే కార్యకర్తల హృదయాలను గెలుచుకున్నారు చంద్రబాబు. 'ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్' పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు" అని మోదీ పేర్కొన్నారు.

ఇక, రాష్ట్రంలో 'సూపర్ జీఎస్టీ... సూపర్ సేవింగ్స్' ప్రచార ఉద్యమాన్ని విజయవంతం చేసినందుకు మంత్రి నారా లోకేశ్‌ను మోదీ అభినందించారు. వినూత్న పోటీలు, ప్రచార కార్యక్రమాల ద్వారా యువతకు జీఎస్టీ గురించి అవగాహన కల్పించారంటూ 'ఎక్స్'లో ప్రశంసించారు. దీనిపై స్పందిస్తూ లోకేశ్, "జీఎస్టీ సంస్కరణలతో పన్నుల విధానంలో మార్పులు వచ్చి, దేశ ఆదాయం పెరుగుతోంది. ఇంత మంచి కార్యక్రమాన్ని తలపెట్టినందుకు రాష్ట్ర ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు" అని అన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story