MP Kalisetti Appala Naidu: ఉత్తరాంధ్రలో జరుగుతున్న ప్రగతిని కళ్లారా చూస్తున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని ప్రశంసించారు.

రాజాంలోని తెదేపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ కుట్రలు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

“రాష్ట్ర పరువును దిల్లీలో తగ్గించేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. సొంత జిల్లా కడపలో స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసినా ఐదేళ్లలో ఒక్క పని కూడా పూర్తి చేయలేకపోయారు” అని ఎంపీ ఆరోపించారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ అభివృద్ధిని ప్రశంసించారని, విద్య, ఐటీ, నీటిపారుదల, మౌలిక వసతులు, సాగు, సాంకేతికత రంగాల్లో రాష్ట్రం అగ్రస్థానం వహిస్తోందని, మిగతా రాష్ట్రాలు ఏపీని రోల్ మోడల్‌గా తీసుకోవాలని చెప్పారని కలిశెట్టి గుర్తు చేశారు.

అయితే జగన్ మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారని, ప్రజలు రాబోయే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి మరింత బుద్ధి చెప్పడం ఖాయమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్పష్టం చేశారు.

Next Story