✕
Chief Minister Nara Chandrababu Naidu: రాష్ట్ర సముద్ర జలాల్లో హైస్పీడ్ పెట్రోల్ బోట్లతో గస్తీ పెంచాలి: సీఎం చంద్రబాబు
By PolitEnt MediaPublished on
హైస్పీడ్ పెట్రోల్ బోట్లతో గస్తీ పెంచాలి: సీఎం చంద్రబాబు

x
Chief Minister Nara Chandrababu Naidu: మత్స్యకారుల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు హైస్పీడ్ పెట్రోలింగ్ బోట్లను తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
తమిళనాడు నుంచి జరిగే అక్రమ బోట్ల చొరబాట్ల వల్ల మత్స్యకారులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. బాపట్ల నుంచి సూళ్లూరుపేట వరకు ఏపీ సముద్ర జలాల్లో గస్తీని మరింత పెంచాలని ఆదేశించారు.
ఈ మేరకు 4 హైస్పీడ్ పెట్రోలింగ్ బోట్లు వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఇలా చేస్తే మత్స్యకారులు సురక్షితంగా చేపలు పట్టుకునే వాతావరణం ఏర్పడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.
Next Story

